Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కడప జిల్లాలో భారీగా ఎర్రచందనం స్వాధీనం

కడప జిల్లా రైల్వే కోడూరు మండలం ఉర్లగట్టుపాడు వద్ద అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనాన్ని అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ ఎర్రచందనం విలువ రూ. 30 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఎర్రచందనాన్ని తరలిస్తున్న నలుగురిని అరెస్ట్ చేసినట్టు చెప్పారు.

More Telugu News